ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ప్రతిపక్షనాయకులు అధికార నాయకులపై అలాగే అధికార నాయకులు ప్రతిక్ష నాయకులపై విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు… తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ అలాగే మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…
2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారం చేయించారని దీంతో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు… అయితే తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ను దూరం పెట్టారని నాని అన్నారు…
వాస్తవానికి లోకేశ్ ది కార్పోరేటర్ స్థాయి కూడా కాదని సెటైర్స్ వేశారు నాని… కుమారుడు అయినందువల్లే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ ద్వారా మంత్రిపదవి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు…