ఫ్యూచర్ కోసం తమ హీరోకి రంగంలోకి దింపుతున్నారా?

ఫ్యూచర్ కోసం తమ హీరోకి రంగంలోకి దింపుతున్నారా?

0
84

టీడీపీ పార్టి ఫ్యూచ ర్ కోసం తమ హీరోని రంగంలోకి దించేందుకు కొంతమంది నేతలు ప్రయుత్నిస్తున్నారన్న ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. టీడీపీ పార్టీకి పూర్వ వైభోగం రావాలంటే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రత్యేక్ష రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది అన్న ప్రచారం ఉంది.

ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్లలేని కొంత మంది నేతలు జూనియర్ ఎన్టీఆర్‌తో టచ్‌లోకి వెళ్లే ప్రయుత్నంలో ఉన్నట్టు సమాచారం టీడీపీ ఘెరంగా ఓడి పోయి నేతలు బీజేపీ బాట పడుతున్న సవుయంలో మరో పార్టీ అవసరం ఏపీలో ఉందన్న వాదన రాజకీయంలో ఉంది.

ఏపీలో టీడీపీ ఓడిపోగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై చర్చ జరిగింది. ఘోరంగా ఓడిన టీడీపీకి ఇక పునర్జమ్మ లేదని జూనియర్ కున్న ఛారిష్మా, కరిష్మా తాత స్టైల్ రాజకీయంగా కలిసోచ్చే అంశాలుగా రాజకీయ పండితులు చెప్తు ఉంటారు. బాబయ్ బాలయ్య లోకేష్ కంటే జూనియుర్‌కు ఎక్కవ పోలిటికల్ యాంగిల ఉంటుందన్న చర్చ ఎలాగూ ఉంది. మరి ఎన్టీఆర్‌కి రాజకీయాల్లోకి దించాలన్న ప్రయుత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి