టీడీపీలోకి నందమూరి వారసుడు న్యూ ఎంట్రీ…. జూనియర్ ఎన్టీఆర్ కు చెక్…

టీడీపీలోకి నందమూరి వారసుడు న్యూ ఎంట్రీ.... జూనియర్ ఎన్టీఆర్ కు చెక్...

0
78

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సగుతున్నాయి… విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధులా మారుతున్నారు… ముఖ్యంగా మంత్రి కొడాలి నాని అలాగే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి…

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి అంత ప్రాధాన్యం లేదని పార్టీ మళ్లీ పూర్వ వైభవం రావాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యం అవుతుందని అన్నారు… గతంలో ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారం చేయడం వల్లే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని వారు అన్నారు… దీనిపై టీడీపీ తరపున వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు… తమకు ఎన్టీఆర్ అవసరం లేదని తమ నేత చంద్రబాబు నాయుడు ఉంటే చాలని అన్నారు…

ఇక ఇదే క్రమంలో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చారు… నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు… దీంతో ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇటీవలే సోషల్ మీడియాను వేధికాగా చేసుకుని వంశీ నానిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

అయితే చైతన్య ఎంట్రీ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని వార్తలు వస్తున్నాయి… నందమూరి వారసుడిని అడ్డుపెట్టుకుని వంశీ నానిలపై విమర్శలకు నందమూరి వారసుడితోనే కౌంటర్ ఇప్పించి ఉంటారని అంటున్నారు…