జూ. ఎన్టీఆర్ కు టీడీపీ బంపర్ ఆఫర్

జూ. ఎన్టీఆర్ కు టీడీపీ బంపర్ ఆఫర్

0
94

నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా…. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారాలోకేశ్ కు కాకుండా ఎన్టీఆర్ కు దక్కనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో. చాలా కాలంగా ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపించ గల సత్తా కేవలం ఎన్టీఆర్ కుమాత్రమే ఉందని అంటున్నారు. ప్రస్తుతం లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు పార్టీని నడిపించగలిగే శక్తిలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదే ఎన్టీఆర్ కు అయితే ఆశక్తి ఉందని అంటున్నారు. పైగా ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అయితే ఎన్టీఆర్ కు రాజకీయాల్లో అంతగా అనుభవం లేదు. క్లిష్టమైన పరిస్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు.

మరి ఆయన చేతిలోపార్టీని పెడితే సమర్థవంతంగా నడపగలరా అనే ప్రశ్న తమ్ముళ్లను వెంటాడుతోందట. గతంలో కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొన్న ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను అప్ప జెప్పితే ఆయన ఏవిధంగా రాణిస్తారో చూడాలి.