ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ తెరవెనుక ఆ కీలక ఎమ్మెల్యే ఉన్నారా

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ తెరవెనుక ఆ కీలక ఎమ్మెల్యే ఉన్నారా

0
80

తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… తనకు తెలిసిన పది మందిలో సుమారు ఎనిమిది మంది జూనియర్ ఎర్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారని గుర్తు చేశారు వంశీ…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తనను ఇటీవలే కలిసిన కొంతమందిలో చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపించగలిగే సమర్థత జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుందని ప్రతీ ఒక్కరు ఇంటర్ నల్ గా చర్చించుకుంటున్నారని వంశీ అన్నారు…

తెరపైకి ఎన్టీఆర్ తీసుకు వచ్చేందుకు వంశీ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రయాంతో పార్టీనుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారా అనే దానికి ఆయన సమాధానం ఇస్తూ పార్టీలో హై లెవల్లో ఉన్న వారు తనను పొమ్మనలేక పొగపెట్టారని అందుకే ఈ పని చేశారని వంశీ అన్నారు.. అయితే వారు ఎందుకు చేశారు అనేది తనకు తెలియదని వంశీ తెలిపారు…