జూన్ 8 న తెరవనున్న మాల్స్ కేంద్రం ప్రకటించిన రూల్స్ ఇవే తప్పక తెలుసుకోండి

జూన్ 8 న తెరవనున్న మాల్స్ కేంద్రం ప్రకటించిన రూల్స్ ఇవే తప్పక తెలుసుకోండి

0
77

జూన్ 8 నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం… ఇందులో మాల్స్ దేవాలయాలు ప్రార్ధనా మందిరాలు, హోటల్స్ రెస్టారెంట్లు తెరచుకోవచ్చు అని తెలిపింది, అయితే మాల్స్ కు పలు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది, మరి అవి ఏమిటో చూద్దాం,
మాల్ కు వచ్చిన తర్వాత ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయితే, ఆ రోగి గత 48 గంటలు తిరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. తర్వాత మాల్ తెరచుకోవచ్చు, ఒకవేళ ఎక్కువమందికి వస్తే మాత్రం మాల్ కొద్ది రోజులు మూసేయాలి.

ఎంట్రన్స్లో తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. ఎవరు లోపలికి వచ్చినా మాస్క్ ధరించాలి, విజిటర్స్ కస్టమర్లు, ఉద్యోగులు ఇలా అందరూ మాస్క్ ధరించాలి.. మాల్ లో ఉన్నంతసేపు మాస్క్ తీయకూడదు, అక్కడ యాడ్స్ ఉండాలి వైరస్ రాకుండా జాగ్రత్తలు చెప్పే యాడ్స్ ప్రదర్శించాలి.

సామాజిక దూరం పాటించాలి, పిల్లలు వృద్దులని షాపింగ్ కు తీసుకురాకండి.. షాపింగ్ మాల్ బయట, లోపల పార్కింగ్ మేనేజ్మెంట్ చేయాలి. షాపింగ్ మాల్లో ఉండే దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్లలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. రోజుకి ఆరుసార్లు శానిటైజ్ చేయాలి, లిఫ్ట్ దగ్గర స్టాఫ్ ఉండాలి, ఎస్కలేటర్ లో మెట్లపై ఒక్కరు మాత్రమే ఎక్కేలా చూడాలి.