జూన్ 8 న తెరవనున్న ప్రార్ధన ఆలయాలు రూల్స్ ఇవే తప్పక తెలుసుకోండి

జూన్ 8 న తెరవనున్న ప్రార్ధన ఆలయాలు రూల్స్ ఇవే తప్పక తెలుసుకోండి

0
32

కేంద్రం జూన్ 8న ప్రార్ధనా ఆలయాలు తెరచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది, అంతేకాదు పలు రూల్స్ కండిషన్స్ నియమ నిబంధనలు ప్రార్ధనాఆలయాలకు ఇచ్చింది, అక్కడ సభ్యులు అందరూ భక్తుల విషయంలో ఈ జాగ్రత్తలు చెప్పాల్సిందే.

ఏ ఆలయానికి అయినా ప్రవేశ ద్వారం దగ్గర తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. చేతులు కాళ్లు శుభ్రం చేసుకుని దేవాలయంలోకి రావాలి, ఇక జలుబు, దగ్గు ఉన్నవారు రాకుండా ఉంటే మంచిది, మాస్క్ ఫేస్ కవర్ పెట్టుకుని రావాలి, లేకపోతే అనుమతించకూడదు.. లోపల ఉన్నంత సేపు వారు మాస్క్, ఫేస్ కవర్ ధరించాలి.

వైరస్ గురించి పోస్టర్లు ఆడియో వీడియో యాడ్స్ ఇవ్వాలి, బూట్లు చెప్పులు సొంత వాహనాళ్లో పెట్టుకోవాలి, లేకపోతే ప్రత్యేక షూ, చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయాలి అక్కడే విడవాలి, పార్కింగ్ దగ్గర వాహనాలు క్రమ పద్దతిలో చేయాలి. రద్దీ లేకుండా పదుల సంఖ్యలోనే భక్తులని లోనికి పంపాలి.. దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్ల వద్ద తప్పనిసరిగా సామాజిక దూరం పాటించేలా చూడాలి. భక్తులకి క్యూలో మార్కింగ్ తప్పినసరిగా ఉండాలి,లోనికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఉండాలి. క్యూలో లోనికి వెళ్లే సమయంలో కనీసం ఒకరికి మరొకరికి మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.ఆలయాల్లో విగ్రహాలను ఎవరూ తాకకుండా చూడాలి. ఇవన్నీ ప్రార్ధనా ఆలయాలకు కొత్త నిబంధనలు.