జూన్ జూలై చాలా డేంజర్ కేసులు తగ్గకపోతే ఇక అదే చేయాలి – నిపుణులు

జూన్ జూలై చాలా డేంజర్ కేసులు తగ్గకపోతే ఇక అదే చేయాలి - నిపుణులు

0
38

దేశంలో ముందు లాక్ డౌన్ విధించిన సమయంలో కేసులు కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి, అయితే లాక్ డౌన్ తో పూర్తిగా భారత్ నుంచి ఈ వైరస్ తగ్గుతుంది అని భావించారు.. కాని ఇప్పుడు లాక్ డౌన్ 55 రోజులు అయినా కేసులు సంఖ్య తగ్గడం లేదు.. దాదాపు 1 లక్ష కేసులు నమోదు అయ్యాయి, మే 31 వరకూ కేంద్రం లాక్ డౌన్ పొడిగించింది.

ఇక వచ్చేది వర్షాకాలం.. ఈ సమయంలో మరిన్ని కేసులు పెరిగితే ఇక జూన్ లో కూడా లాక్ డౌన్ తప్పదు అంటున్నారు విశ్లేషకులు, అయితే సడలింపుల వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
మరిన్ని కేసులు పెరిగితే జూన్ నుంచి పూర్తిస్దాయి లాక్ డౌన్ అమలు చేయాల్సిందే అంటున్నారు.
ఇప్పుడు రోజుకి నాలుగు వేల కేసులు నమోదు అవుతున్నాయి ఇది ఇంకా భయపెట్టిస్తోంది.

ఇక కార్యాలయాలు ఆఫీసులు పనిచేస్తే అందరూ కలిసి ఏదో సమయంలో కలుస్తారు.. వారిలో ఒకరికి ఉన్నా వైరస్ సోకుతుంది. ఉదాహరణ దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలు. లాక్ డౌన్ సడలించి తిరిగి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించారని తెలియచేస్తున్నారు నిపుణులు. అందుకే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, అవసరం అయితేనే బయటకు వెళ్లాలి.