జూనియర్ ఎన్టీఆర్ దగ్గర 2009లో చంద్రబాబు అదే చేశారు — కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర 2009లో చంద్రబాబు అదే చేశారు --- కొడాలి నాని

0
85

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆగేలా లేదు… జూనియర్ ఎన్టీఆర్ వార్తలు రావడం ఆయన గురించి కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఈ అంశం మరింత రచ్చ లేపింది, అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా తెలుగుదేశం బాధ్యతలు తీసుకుంటారని, లోకేష్ వల్ల పార్టీ ముందుకు వెళ్లదు అని సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వంశీ బయటకు వచ్చి చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేసిన తర్వాత మంత్రి కొడాలి నాని కూడా విమర్శలు చేశారు.. అయితే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని టికెట్ సంపాదించారు అని విమర్శలు చేశారు టీడీపీ నేతలు, దీనిపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తనకు, వల్లభనేని వంశీకి రాజకీయ బిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆరే అని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్‌టీఆర్ రాజకీయ జీవితం అంతమయ్యిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అనుకుంటున్నారని, మొదటి నుంచి కష్టపడి వచ్చిన ఎన్టీఆర్ సినిమాలలో స్టార్ అవ్వకుండా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలెవరైనా ఆపగలిగారా అంటూ నాని ప్రశ్నించారు. 2009 ఎన్నికలలో చంద్రబాబు జూనియర్ ఎన్‌టీఆర్ కాళ్ళు పట్టుకున్నారని గుర్తు చేశారు. అయితే మొత్తానికి ఇఫ్పుడు నాని చేసిన కామెంట్లు మరింత కాక రేపుతున్నారు… నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారా అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.