టీడీపీ కంచుకోటకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా… ఎన్టీఆర్ నాటినుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు టీడీకీ అండగా నిలుస్తూనే వచ్చింది కృష్ణా జిల్లా… అలాంటి జిల్లా 2019 ఎన్నికల్లో జగన్ సునామితో కొట్టుకుపోయింది… ఇక ఈ విషయం పక్కన పెడితే మాజీ మంత్రి దేవినేని ఉమా వల్ల టీడీపీకి చెందిన ఓ కీలక నేత బలైపోయారట…
ఆయన ఏవరోకాదు పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు… ప్రస్తుతం ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు… గతంలో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసిన కాగిత చాలాకాలంగా పార్టీలో అసంతృప్తి చెందుతున్నారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమా జ్యోక్యం వల్లే కాగితకు మంత్రిపదవి రాలేదని అతని అనుచరులు అంటున్నారు…
దీంతో ఆయన ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగారు… 2019 ఎన్నికల్లో కూడా తన కుమారుడుని పోటీ చేయించారు… కానీ ఆయన గెలవలేకపోయారు.. అటు పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో కాగితా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు… అంతేకాదు ప్రస్తుతం పెడన సెగ్మెంట్ లో టీడీపీ ఉందాలేదా అన్నట్లు తయారు అయింది…