పార్టీ మార్పుపై క‌ర‌ణం బ‌లరాం సంచ‌ల‌న నిర్ణ‌యం

పార్టీ మార్పుపై క‌ర‌ణం బ‌లరాం సంచ‌ల‌న నిర్ణ‌యం

0
98

తెలుగుదేశం పార్టీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో ముగ్గురు నేత‌లు జంప్ అవుతారు అంటూ మూడు రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే పార్టీలో ఎందుకు ఇలాంటి నైరాశ్యం వ‌చ్చింది అని చాలా మంది భావించారు.. ఏకంగా పార్టీ మార్పుపై ఇన్ని వార్త‌లు రావ‌డంతో నేరుగా రంగంలోకి దిగిన చంద్ర‌బాబు ఈ ముగ్గురు నేత‌ల‌తో ఫోన్లో మాట్లాడారు అని వార్త‌లు వినిపించాయి.

అయితే తాజాగా ఓ కీల‌క వ్యాఖ్య ఈ పార్టీ నాయ‌కుల జంప్ ఎపిసోడ్ కు ముగింపు ప‌లికింది అని చెప్పాలి.. అవును ప్రకాశం జిల్లా రాజకీయాలపై తమదైన ముద్రవేసిన టీడీపీ నాయకుడు కరణం బలరాం కూడా పార్టీ మారుతున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి, జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు ఆయ‌న వెళ్లి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి సైకిల్ పార్టీకి గుడ్ బై చెబుతారు అన్నారు.

కాని వాస్త‌వం కాదు అని తెలుస్తోంది. చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారాల్సినంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అయినా ఎవరో బెదిరిస్తే పార్టీ మారడానికి తనకేమీ రాళ్లు, ఇసుక వ్యాపారాలు లేవని తెలిపారు. ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని తెలిపారు.. దీంతో చీరాల, అద్దంకి టీడీపీ నేత‌లు క‌ర‌ణం వర్గీయులు ఆనందంలో ఉన్నారు.