మంత్రి కన్నబాబుకి మరో రెండు బాధ్యతలు అప్పగించిన సీఎం

మంత్రి కన్నబాబుకి మరో రెండు బాధ్యతలు అప్పగించిన సీఎం

0
99

ఏపీలో మంత్రుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షల్లో తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్.. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు చేసింది.

మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖను కురసాల కన్నబాబుకు అప్పగించారు. కన్నబాబుకు ఆహారశుద్ధి విభాగాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఆహారశుద్ధి విభాగాన్ని వేరు చేశారు.

అయితే ఇప్పటి వరకూ ఈ శాఖని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చూశారు, ఇక వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకి ఈ రెండు శాఖలతో పని ఉంటుంది పరిపాలకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ శాఖలు కూడా ఆయనకు అప్పగించారు అని తెలుస్తోంది, రొటేషన్ పద్దతిలో అన్నీ చివరకు వ్యవసాయశాఖకే చేరాలి.. అందుకే అన్నీ ఆ మంత్రి దగ్గరే ఉంటే పనులు వేగంగా పూర్తి అవుతాయి అని సీఎం జగన్ ఉన్నతాధికారులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.