కన్నా పోస్ట్ పై టీడీపీ కన్ను.

కన్నా పోస్ట్ పై టీడీపీ కన్ను.

0
84

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కన్నాలక్ష్మీ నారాయణ ఉన్నారు… ప్రస్తుతం ఆయన పోస్ట్ పై టీడీపీ నాయకులు కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన తమ్ముళ్లు ఢిల్లీ లెవెల్లో పదవిని చేపట్టేందుకు మంతనాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

తమకు ఏపీ బాధ్యతలను అప్పజెప్పితే మొత్తం ఏపీ వ్యవహారాలతో పాటు పార్టీ నడపడాకికి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ కూడా ఇచ్చేందుకు సిద్దమని అంటున్నారట… దీంతో కన్నా లక్ష్మీ నారాయణ అలర్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి… అందుకే ఆయన వైసీపీని టార్గెట్ చేశారని విస్వసనీయ వర్గాల సమాచారం…

కొద్దికాలంగా కన్నా అధికార ఎమ్మెల్యేలను మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ విమర్శలన్ని కన్నా తన పోస్ట్ ను కాపాడుకునేందుకే చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి