కేఏ పాల్ వల్ల జగన్ కు తలనొప్పి..ఏకంగా 35 స్థానాలకు ఎసరు..!!

కేఏ పాల్ వల్ల జగన్ కు తలనొప్పి..ఏకంగా 35 స్థానాలకు ఎసరు..!!

0
118

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తర్వాత అంత ప్రజాదరణ ఉన్న పార్టీ ఏదంటే వైసీపీ అని చెప్పొచ్చు..టీడీపీ కి అంత గట్టిపోటీ ఇచ్చే పార్టీ కూడా ఇదే కావడం వీశేషం.. ఇంకా చెప్పాలంటే ఈ సారి జరగున్న ఎన్నికల్లో జగన్ కే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టనున్నారని అనేక సర్వేలలో వెల్లడైంది. టీడీపీ పార్టీ అవినీతి, అభివృద్ధిలేమితో విసిగెత్తిపోయిన ప్రజలు ఈసారి జగన్ కి కిరీటం అప్పగిస్తారని వెల్లడైంది.. అయితే ఏదైనా సాధించాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి.. అలాంటిది జగన్ కి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నాయి..అది కూడా ఈ కొద్దీ సమయంలోనే ఆ నియోజకవర్గాల్లో తన పట్టు పోయినట్లు తెలుస్తుంది.. జగన్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 నియోజకవర్గాల్లో గట్టి దెబ్బే తగిలేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదంతా ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన ఒక సడెన్ స్టార్ వల్ల వచ్చింది. ఈ ఎన్నికల్లో భాగంగా గత కొంత కాలం నుంచి కే ఎల్ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున పెద్ద ఎత్తున హడావుడి చేసిన సంగతి అందరికి తెలిసినదే. ఇప్పుడు తాజాగా ఇతగాడి వలన జగన్ కు ఊహించని రీతీలో దెబ్బ తగిలేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.జగన్ నిలబెట్టిన 174 నియోజకవర్గాల్లో మొత్తం 35 అసెంబ్లీ స్థానాల్లో మరియు 4 పార్లమెంట్ స్థానాలలో పాల్ ప్రజాశాంతి పార్టీకి చెందిన అభ్యర్థులు నిలబడనున్నారు,

అయితే పాల్ అభ్యర్థులుకు జగన్ వేవ్ ముందు తట్టుకునే శక్తి ఉందా అని అనుకోవచ్చు ఇక్కడే అసలైన కిటుకు ఉంది మొత్తం ఈ 35 మరియు 4 అసెంబ్లీ,పార్లమెంటు స్థానాలలో జగన్ నిలబెట్టిన అభ్యర్థుల పేర్లకు చాలా దగ్గరగా ఉండడంతో వైసీపీకి వచ్చే ఓట్లు చీలిపోతాయని వైసీపీ శ్రేణులు ఇప్పుడు భయపడుతున్నారు. అంతే కాకుండా వైసీపీ ఫ్యాను గుర్తుకు దగ్గరగా ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు కూడా ఉందని దీనివలన పార్టీకి పెద్ద నష్టం వాటిళ్లేందుకు ఛాన్స్ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.ఇక్కడే పాల్ చేసిన పని వలన వైసీపీకి నష్టం కలిగేలా ఉందని ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ను రద్దు చేసుకోవాలని అడగగా దానికి రివర్స్ లో పాల్ తన పార్టీ 2008 నుంచి ఉందని నా పార్టీ కండువాను జెండాను వైసీపీ వారు కాపీ కొట్టారని అవసరమైతే పార్టీ అభ్యర్థులనే వెనక్కి తీసుకోమనండి అని అంటున్నారు.ఒకవేళ ఎన్నికల సంఘం వారు కానీ ఈ విషయంలో ఎలాంటి చర్య కానీ తీసుకోకపోనట్టైతే ఒక్కో నియోజకవర్గం నుంచి పాల్ సులభంగా 5వేల నుంచి 10వేల ఓట్లు చీల్చేస్తాడని విశ్లేషకులు అంటున్నారు.ఒకవేళ ఇదే కనుక జరిగితే జగన్ కు గట్టి దెబ్బ తప్పదని చెప్పాలి.ఒకవేళ ఎన్నికల సంఘం వారు కానీ ఈ విషయంలో ఎలాంటి చర్య కానీ తీసుకోకపోనట్టైతే ఒక్కో నియోజకవర్గం నుంచి పాల్ సులభంగా 5వేల నుంచి 10వేల ఓట్లు చీల్చేస్తాడని విశ్లేషకులు అంటున్నారు.ఒకవేళ ఇదే కనుక జరిగితే జగన్ కు గట్టి దెబ్బ తప్పదని చెప్పాలి.