టీడీపీ నేతలకు మతి భ్రమించిందా

టీడీపీ నేతలకు మతి భ్రమించిందా

0
90

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు మతి భ్రమించిందా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి…. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓటమి తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు మతి భ్రమించిందని ఆయన ఆరోపించారు….

కొద్దికాలంగా ప్రభుత్వ పాలనను విమర్శించడమే ద్యేయంగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని రామచంద్రా రెడ్డి మండిపడ్డారు… అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల రౌడీ ఇజం రోజు రోజుకు పెరిగిపోతుందని అన్నారు…

మాజీ మంత్రి కాలువ శ్రీనివాస రావు పేరు వింటుంటే ప్రస్తుతం అనంత ప్రజలు భయపడుతున్నారని అన్నారు… కొద్దికాలంగా కాలువ అనుచరులు వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పుడుతున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు…