కర్ణాటక నేటి రాత్రి నుంచి కీలక నిర్ణయం సోమవారం వరకూ

కర్ణాటక నేటి రాత్రి నుంచి కీలక నిర్ణయం సోమవారం వరకూ

0
93

దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, దేశ వ్యాప్తంగా పూర్తిగా లాక్ డౌన్ మే 31 వరకూ అమలు అవుతుంది అనేది తెలిసిందే, అయితే కొందరు వీటిని పాటిస్తుంటే మరికొందరు వీటిని పాటించడం లేదు.. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు, కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇష్టం వచ్చిన రీతిన వ్యవహరిస్తున్నారు ప్రజలు.

భౌతికదూరం పాటించకుండా.. మాస్క్ ధరించకుండా.. కరోనా కష్టకాలంలోనూ సాధారన రోజుల్లోలాగే తిరిగేస్తున్నారు.. ఇక దీనికి చెక్ పెట్టాలి అని కర్ణాటక ప్రభుత్వం జనతా కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.

ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రేపు ఆదివారం పూర్తిగా కర్ఫ్యూ కొనసాగనుండగా.. తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి లాక్డౌన్ ఉంటుంది, వచ్చే రెండు ఆదివారాలు పూర్తిగా కర్ఫ్యూ రోజులు అవుతాయని పోలీసు కమిషనర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు. ఇక శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ ఈ రూల్స్ ఉంటాయి, నగరంలో రోడ్లపైకి జనం ఎక్కువగా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు, బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తాము అని తెలిపారు.