నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త..రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని పిలుపు

0
86

రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ చెప్పబోతున్నారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు సీఎం కేసీఆర్. తాను రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అయితే వచ్చే నెలాఖరుకు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఉద్యోగ గరిష్ట వయోపరిమితి 8 సంవత్సరాలు పెంపు, ఉద్యోగుల భర్తీకి ఇయర్ క్యాలెండర్ రూపకల్పన కు TSPSC కి ఆదేశాలు, మార్చి చివరి వారం లో టెట్ నోటిఫికేషన్, ఉద్యోగల భర్తీ పూర్తి అయిన తర్వాత 2023 బడ్జెట్ నందు నిరుద్యోగ భృతికి నిధుల కేటాయింపు వీటిపైనే కేసీఆర్ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.