కేసీఆర్‌ సర్కారుకు పిచ్చెక్కింది..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఘాటు వ్యాఖ్యలు

KCR is mad at the government..BJP national president Nadda Ghattu's remarks

0
86

ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నడ్డా బండి సంజయ్ అరెస్ట్‌పై మాట్లాడారు.

బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. బీజేపీ సాధిస్తున్న ప్రజా విజయాలను, బీజేపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ సర్కారుకు పిచ్చెక్కిందన్నారు. పోలీసుల చర్యను నడ్డా తప్పుబట్టారు. అక్రమ కేసులకు భయపడబోమని, న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన బండి సంజయ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోవిడ్ ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పటికే బండి సంజయ్‌పై కేసులు పెట్టారు.