కేసీఆర్ జగన్ కుమ్మక్కు

కేసీఆర్ జగన్ కుమ్మక్కు

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారా అంటే అవుననే అంటున్నారు…కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి… ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీరు తీసుకువెళ్తామని అన్నారని తెలిపారు..

అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడంలేదని నాగం మండిపడ్డారు… తాజాగా ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… గంతంలో కేసీఆర్ రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారని అందుకే ఈ అంశంపై మాట్లాడకున్నారని ఆయన ఆరోపించారు…

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేయాలని చేస్తున్నారని అన్నారు… దిని ద్వారా 1.2 మలక్షల క్యూసెక్కుల నీటిని ఏపీకి తీసుకువెళ్లాలని జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు… అయితే దానిపై కేసీఆర్ ఎందుకు అభ్యంతరం చెప్పకున్నారని నాగం ప్రశ్నించారు…