17 విజయవాడకు కేసీఆర్.. జగన్ తో పలు కీలకాంశాలు చర్చ..!!

17 విజయవాడకు కేసీఆర్.. జగన్ తో పలు కీలకాంశాలు చర్చ..!!

0
109

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వచ్చి అక్కడ
21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు. తన నివాసానికి వస్తన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్ మధ్నాహ్న లంచ్‌కు ఆహ్వానించారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి విజయవాడ చేరకొని అక్కడ విభజన సమస్యలపైనా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రి కొన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. దీని మేరకు హైదరాబాద్‌లో ఏపీ నియంత్రణలో ఉంటూ నిరుపయోగంగా ఉన్న భవనాల అప్పగింత మీద ఒప్పందం జరిగింది. ఇక, మిగిలిని అంశాల మీద ఈ సమావేశంలో చర్చించనున్నారు.