కేసీఆర్ -స్టాలిన్ మీటింగ్ బాబుకి కౌంటర్

కేసీఆర్ -స్టాలిన్ మీటింగ్ బాబుకి కౌంటర్

0
113

సీఎం చంద్రబాబుకు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి నిద్రపట్టనివ్వడం లేదు అని చెప్పాలి… నిత్యం అనేక ట్వీట్లు విమర్శలతో చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారు విజయసాయిరెడ్డి.. ముఖ్యంగా కేంద్రంలో చక్రం తిప్పాలి అని అనుకుంటున్న బాబుకు, ఇటు ఏపీలో మాత్రం అవరోధాలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్షాన్ని ముందు ఎదుర్కొని దేశంలో చక్రం తిప్పాలి అని వైసీపీ నిలదీస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలు ఎన్నికల తర్వాత కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ పై పెద్ద ఎత్తున నేతలను ఒకటి చేస్తున్నారు, ఈ సమయంలో తెలుగుదేశం నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. తాజాగా నిన్న కేసీఆర్ స్టాలిన్ తో భేటీ అయ్యారు, తమిళనాడులో తెలంగాణలో హస్తినలో కూడా దీనిపై చర్చ జరిగింది.

స్టాలిన్ ను కెసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్ర పట్టదు. స్టాలిన్ ను తనూ కలిసి అటువంటిదేమి లేదు అని ప్రకటించేదాకా ఊరుకోడు.. 2 ఎంపీ సీట్లు కూడా కష్టమేనని తెలిశాక ఎవరు లెక్కచేస్తారు, ఈయన పిచ్చి కాకపోతే. అంటూ విజయసాయిరెడ్డి ట్వీటెట్టారు, మొత్తానికి వైసీపీ నేతలు దీనిని షేర్ చేస్తున్నారు.. టీడీపీ నేతలు దీనికి కౌంటర్లు ఇస్తున్నారు, ఈ విమర్శలు ఆగాలి అంటే మే 23 ఫైనల్ రిజల్ట్ చూడాలి అని అంటున్నారు తటస్దులు.