వైసీపీలో బ్రదర్స్ కు గుడ్ న్యూస్

వైసీపీలో బ్రదర్స్ కు గుడ్ న్యూస్

0
46

మొత్తానికి ఏపీలో ఈసారి ఎన్నికలు మంచి రసవత్తంగా సాగాయి అని చెప్పాలి ..ముఖ్యంగా ఫలితాల పై ఆసక్తి చాలా పెరిగిపోయింది.. వైసీపీ అధినేత జగన్ గెలుస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అలాగే సర్వేలు కూడా ఆయనకు పాజిటీవ్ గా వస్తున్నాయి.. ఇక జగన్ గెలుపు పక్కా అని చెబుతున్నారు అందరూ. ఈ సమయంలో ఇద్దరు సోదరుల గెలుపు గురించి చర్చ జరుగుతోంది..వారే ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్లోనే రాజకీయంగా ఎదిగారు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా కూడా ఉన్నారు.

వీరు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు ఇద్దరూ కూడా అని చెప్పాలి. .శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట శ్రీకాకుళం ఈ రెండు సెగ్మెంట్లలో ఇప్పుడు తెలుగదేశం పార్టీ అభ్యర్దులపై వ్యతిరేకత ఉంది… ఈ ఐదు సంవత్సరాల పాలన నచ్చక ప్రజలు ఇప్పుడు వైసీపీకి ఇక్కడ పట్టం కడతారు అని చెబుతున్నారు.. అందుకే ఇక్కడ తెలుగుదేశం నేతలకు గెలుపు రాదు అని చెబుతున్నారు. ఇక సర్వేలు కూడా అదే విషయం చెబుతున్నాయి ..ఈ రెండు సెగ్మెంట్లు వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నాయి. అందుకే సిక్కోలులో ఈ బ్రదర్స్ కు గెలుపు పక్కా అని చెబుతున్నారు ఇక్కడ విశ్లేషకులు, మరి మే 23 న ఫలితాల రోజు భారీ మెజార్టీతో వైసీపీ బ్రదర్స్ గెలుపు మీరే చూస్తారు అని వారి కేడర్ కూడా చాలా ధీమాగా ఉన్నారు.