ఢిల్లీలో కేసిఆర్ దొంగ దీక్షలు..

0
85

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు వ్యవహారంపై నేతలందరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఎంపీ స్టార్ క్యాంపెయినర్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రైతులు చేమోటోడ్చి పండించిన పంటకు కొనకుండా ఢిల్లీలో కెసీఆర్ చేసిన దొంగ దీక్షను ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని అతను తెలిపారు.

రాష్ట్రంలో ఏమి చేయ‌లేకే ఢిల్లీ వెళ్ళి నాట‌కాలు వేస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు. చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్ కు కూడా పడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు కానీ మేము నిరసనలు చేస్తే అరెస్ట్ లు చేయిస్తున్నారు అని ఫైర్ అయ్యాడు. దేవుడు దయ వల్ల వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది.

కానీ దాన్ని అవకాశంగా వాడుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీ లు ఓకరి పై ఓకరు నెపం పెట్టుకుంటుంన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఎవరి వాదన వారిదే అన్నట్టు పరిస్థితి ఉండగా రైతాంగం మాత్రం దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉంది. కానీ ఎన్నికల సమయంలో ఇద్దరి సంగతి ప్రజలే  తేలుస్తారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.