కేఈ కృష్ణ మూర్తి సంచలన నిర్ణయం

కేఈ కృష్ణ మూర్తి సంచలన నిర్ణయం

0
94

టీడీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు… కర్నూల్ జిల్లా కీలక నియోజకవర్గం అయిన డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తెలిపారు కేఈ…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు..

దీంతో డోన్ మున్సిపాలిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి… కాగా తాజాగా ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… మున్సిపల్ ఎన్నికల్లో తమ వారికి అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు…