కేదార్​నాథ్ ఆలయం మూసివేత..మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?

Kedarnath temple closed..when will it reopen?

0
118

ఉత్తరాఖండ్ లోని కేదార్​నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ ఆలయంతో పాటు గంగోత్రి , యమునోత్రి పుణ్యక్షేత్రాలను సైతం మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పూజా కార్యక్రమాలు, భక్తుల సందర్శనను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ ఆలయాలను మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ 6 నెలల తర్వాత ఆలయాలు తెరుచుకుంటాయని చెప్పారు. కాగా 2 రోజుల క్రితం ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు..గంగోత్రి ఆలయాన్ని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాల అనంతరం 11.45 గంటలకే మూసివేశారు. ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరయ్యారు. ఆలయంలోని ఉత్సవ డోలిని(గంగామాత ఉత్సవ విగ్రహం) ముఖ్బాకు తరలించారు. ఆరు నెలల పాటు గంగామాతకు అక్కడే పూజలు జరగనున్నాయి. భాయ్​ దూజ్​ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.