కేంద్రానికి బిగ్ షాక్

కేంద్రానికి బిగ్ షాక్

0
77

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైల్వేను ప్రయివేటీకరణ చేసే విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల కొండారెడ్డి ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు, కార్మికులు గుత్తి రైల్వేస్టేషన్ ఆవరణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంధర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళకొండారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్ద సంస్థ అయిన రైల్వే సంస్థను కార్పొరేటర్ కు కట్టబేట్టేందుకు కుట్రలు చేస్తుందని,ఫారన్ డెవలప్మెంట్ ఇన్వెస్టిమెంట్ అనేది రైల్వేలో ప్రవేశపెట్టడం ద్వారా ఇది రైల్వే సొత్తును రైల్వే ప్రజల సొత్తును నాకిది నీకది ధోరణి లో కార్పొరేటర్లకు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు…

ప్రజల ఆస్థిన్ని కార్పోరేట్లకు దోచిపెట్టడం వెనుక ఎవ్వరి స్వాలంబన దాగివుందో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.కార్మికులకు 8 గంటల పనిదినాన్ని పెంచుతుందని,కార్మిక చట్టాలను సవరణలు చేస్తూ కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు అన్ని రైల్వే స్టేషన్ల ముందు కార్మిక సంఘం సిఐటియు నిరసన చేస్తోంది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు,జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నిర్మల,రైతు సంఘం మండల కార్యదర్శి రామకృష్ణ,కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున మండల కార్యకర్తలు రామచంద్ర, షేక్ పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.