చైనాని దాటేసిన కేరళ మరో సంచలనం

చైనాని దాటేసిన కేరళ మరో సంచలనం

0
71

గత నెల రోజులుగా చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) ఇప్పటికే వెయ్యికి పైగా ప్రాణాలను బలిగొంది. 50 వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది అని అంటున్నారు, అయితే మన దేశంలో కూడా కొంత మంది కరోనా వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నారు. కరోనా లక్షణాలు ఉన్న కొందరికి కేరళలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ వైద్యులు.

కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు కరోనా బాధితులు పూర్తి స్వస్థత పొందారు అని తెలుస్తోంది ..చైనాలోని వుహాన్ లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. వారికి కరోనా సోకింది అని తేలింది. వారికి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే వారికి కోరానా లక్షణాలు తగ్గాయి అని తేలింది, దీనిపై కేరళ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది…గతంలో నిపా వైరస్ ను జయించామని . ఇప్పుడు కరోనా వైరస్ పై పోరాటంలోనూ కేరళ విజయం సాధించిందని అక్కడ అధికారులు తెలిపారు, చైనాలో మాత్రం ఈ వైరస్ ఇంకా అంతకంతకూ పెరుగుతూ ఉంది.