విజయవాడ ఎంపీ మరో టీడీపీ నేతను టార్గెట్ చేశారా ?

విజయవాడ ఎంపీ మరో టీడీపీ నేతను టార్గెట్ చేశారా ?

0
97

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీరు సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో వైసీపీ, బీజేపీతో పాటు సొంత పార్టీ నేతలను కేశినేని టార్గెట్ చేయడంతో… అసలు ఆయన వైఖరి ఏంటో టీడీపీ శ్రేణులకు అర్థంకావడం లేదు. అయితే మొన్నీమధ్య టీడీపీలో షోమ్యాన్‌లు అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశం విజయవాడ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా టీడీపీలో కేశినేని నాని టార్గెట్ మాజీమంత్రి దేవినేని ఉమ మాత్రమే అని అంతా భావించారు.

అయితే షోమ్యాన్లు అంటూ సోషల్‌ మీడియాలో నాని పెట్టిన పోస్టు కూడా వెంకన్నకు మరింత ఆగ్రహం తెచ్చిపెట్టింది. ఈ విషయంలో కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని… తాను తిరగబడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందనీ పార్టీ పెద్దల వద్ద వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అయితే బుద్దా వెంకన్నపై ఎంపీ నాని అసంతృప్తికి మరో కారణం కూడా ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత నాగుల్ మీరాను పోటీ చేయించాలని ఎంపీ నాని భావించారని… అయితే బుద్దా వెంకన్న, దేవినేని ఉమా మాత్రం జలీల్ ఖాన్ కూతురు వైపే మొగ్గుచూపారని సమాచారం.

ఈ కారణంగా చంద్రబాబు కూడా వారి ప్రతిపాదనకే అంగీకరించి జలీల్ ఖాన్ కూతురు షబానాకు టికెట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. బుద్దా వెంకన్నపై ఎంపీ కేశినేని నాని కోపానికి ఇది కూడా ఓ కారణమని టీడీపీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుద్దా వెంకన్నను ఎంపీ కేశినేని నాని టార్గెట్ చేయడం కృష్ణా జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.