సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నా : కేశినేని నాని

సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నా : కేశినేని నాని

0
33

ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న రాజకీయాల్లో ఒక్కసారే ఆహో ఓహో అనే స్థాయికి వచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉంటూ అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఏదో ఒక లోపం ఉందంటూ ఊదరగొట్టే నేత ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే..ఇటీవల జరిగిన ఏపిలో ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లు గెల్చుకొని భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

గత ప్రభుత్వం టీడీపీ చేసిన వైఫల్యాల ప్రజలకు విసుగు తెప్పించి వైసీపీ కి జై కొట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ సైతం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి అందరి హృదయాలు గెల్చుకున్నారు. అధికార పార్టీ చేస్తున్న మోసలు ప్రజలకు విపులంగా వివరించి చెప్పారు.

దాంతో మార్పు కావాలి..మంచి పాలన కావాలని ప్రజలు ఈసారి వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అంతే కాదు తాను ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన నవరత్నాల హామీలు కూడా నెరవేర్చే పనిలో ఉన్నారు. కేవలం నలభై రోజుల పాలనలోనే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు నాంది పలికారు. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

షరామామూలుగానే ప్రతిపక్ష నేతలు ఆయన పాలనపై విమర్శలు కురిపిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని ఓ సంచలన ట్విట్ చేశారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. “సీఎం గారు… మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను.