కరోనా కేసులు ఇంకా పెరుగుతున్నాయి కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కనిపిస్తోంది.. ఇంకా వారు తమ దేశాల్లో విదేశీయులకి నో ఎంట్రీ చెబుతున్నారు, అలాగే డొమిస్టిక్ విమానాలు మాత్రమే తిరుగుతున్నాయి, ఇలా చాలా వరకూ దేశాలు కట్టడి చేస్తున్నాయి, అయితే చైనాలో మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతోంది.
మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దీంతో ఆ దేశం కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా అన్నీ రంగాలు ఇక్కడ దెబ్బ తిన్నాయి, విదేశాలకు ఎలాంటి ఎగుమతులు లేవు, దీంతో అక్కడ నిరుద్యోగం కూడా పెరుగుతోంది..తాజాగా చైనాలో విమాన సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి చైనా విమానయాన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ముఖ్యంగా విమాన సిబ్బందికి సలహాలు సూచనలు చేసింది, వాష్ రూమ్ ని వాడద్దు అని తెలిపింది.
దీనికి బదులుగా డైపర్లు వినియోగించాలని సూచించింది. సిబ్బంది అందరూ తప్పనిసరిగా, మాస్క్ లు, గ్లోవ్స్
ధరించాలి అని తెలిపింది.. పీపీఈ కిట్లు ధరించాలని, బూట్లకు కవర్లు తొడగాలని ధరించే టోపీలకు కూడా కవర్లు పెట్టుకోవాలి అని తెలిపింది చైనా విమానయాన శాఖ.