ప్లీనరీ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Key remarks by CM KCR in the Plenary

0
87

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి హైద్రాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీలో వేదిక‌గా ప్రకటించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్లీన‌రీ వేదిక‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్రహానికి పూల‌మాల వేశారు. అనంత‌రం అమ‌ర‌వీరుల స్థూపానికి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అంత‌కుముందు టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..నేడు తెలంగాణలో తెరాస అద్భుతమైన పునాది ఉన్న పార్టీ. ఇదే తృతిని, ఉధృతిని కొనసాగించాలి. ఈ విజయాలలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టి ఇది అందరి సమిష్టి కృషి.

తెలంగాణ ఇప్పుడు దేశంలో అగ్రగామిగా ఉంది. తెలంగాణ అభివృద్దే మన మతం. దళితబంధుతోనే ఆగం. మిగతా కులాల వారికి చేసే శక్తి, యుక్తి కేవలం టీఆర్ఎస్ కే ఉంది. శాశ్వత పేదరిక నిర్మూలన కోసం ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఈ పథకాలు అమలు చేయలేదు. వారికి చేసే అవకాశం లేదా . రాబోయే ఏడు ఏళ్లలో 23 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మనలను ఎవరు బాగు చేయడు. మనమే బాగు చేసుకోవాలి. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి మన కన్నీళ్లు తుడవరు.

దళితబంధును ఆపేది నవంబర్ 4 వరకేనని..ఆ తర్వాత ఆ పథకాన్ని ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. డిసెంబర్ నాటికి హూజూరాబాద్ లో దళితబంధులను వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని..ఆంధ్రలో కూడా పార్టీని పెట్టండి, గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు.