కలిసొచ్చిన కెజిఎఫ్..కోట్లకు అధిపతి..అంతేకాదు..

KGF joins forces, heads of crores

0
72

బెంగళూరు: నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేశాడు. అదృష్టం వెంటాడింది కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. బెంగళూరులోనే శ్రీమంతులైన రాజకీయ నాయకుల వరుసలో చేరిన ఆయన తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా..కర్ణాటక విధాన పరిషత్తు ఎన్నికల్లో బరిలోకి దిగారు.

ఆయనే..యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు. నామినేషన్‌ పత్రాల దాఖలు సందర్భంగా తన వద్ద రూ.1,643 కోట్ల స్థిరాస్తి, రూ.97 కోట్ల చరాస్తి ఉందని వెల్లడించారు. యూసుఫ్‌ షరీఫ్‌ కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కేంద్రంగా చాలాకాలం పాత సామాను వ్యాపారం చేశారు. ఆ సమయంలో కేజీఎఫ్‌లో పాత ట్యాంకులు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. ఇది అతనికి బాగా కలిసి వచ్చింది.

అందుకే తన పేరూ ‘కేజీఎఫ్‌ బాబు’గా మారిపోయింది. ఆ తర్వాత తన నివాసాన్ని బెంగళూరుకు మార్చి.. వ్యాపారాన్ని విస్తరించి, స్థిరాస్తిలోకీ అడుగుపెట్టారు. మొత్తం 23 బ్యాంకు ఖాతాలున్న బాబుకు రూ.2.99 కోట్ల విలువైన 3 కార్లు, రూ.1.11 కోట్ల చేతి గడియారం, 4.5 కిలోల బంగారం, ఒక్కోటి రూ.లక్ష విలువ చేసే 4 సెల్‌ఫోన్‌లు మూడు చోట్ల రూ.48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ.1593 కోట్ల విలువైన 26 స్థలాలు, రూ.3 కోట్ల విలువైన ఇల్లు ఆస్తుల్లో భాగంగా ఉన్నాయి. రూ.58 కోట్ల రుణాలూ ఉన్నాయి. బాబుకు ఇద్దరు భార్యలు.