ఆహర కొరతతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం

ఆహర కొరతతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం

0
55

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తెలియని వారు ఉండరు, ఆ దేశంలో పాలన శిక్షలు కఠిన నియమాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే, ఇటీవల కిమ్ అనారోగ్యంగా ఉన్నారు అని అనేక వార్తలు వచ్చాయి, మొత్తానికి కోలుకుని ఆయన దేశ పాలన చేస్తున్నారు, అయితే ఇప్పుడు
ఉత్తర కొరియా లో కాస్త ఆహార కొరత ఉంది .

ఈ సమయంలో ప్రజలు తమ పెంపుడు కుక్కలను అప్పగించాల్సిందిగా ఆదేశించారు కిమ్ . జూలైలో ఆయన ఈ కొత్త విధానం ప్రకటించారు. ఎవరైనా గానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీ చేశారు.

ఇక ఆయన ఆదేశాలు ఇవ్వడంతో వేలాదిగా అధికారులు ఆ కుక్కలు ఉన్న యజమానులకి నోటీసులు ఇచ్చారు, ప్రతీ ఒక్కరు తమ కుక్కలను ప్రభుత్వానికి ఇచ్చేశారు,ఇలా తీసుకున్న కుక్కలను
ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. అయితే ఇక్కడ కుక్కమాంసం తింటారు, దీంతో ఇదేం నిర్ణయం అని విమర్శలు వస్తున్నాయి, ఇక్కడ ఇలా కుక్కమాంసం తింటుంటే పక్క దేశం దక్షిణ కొరియాలో క్రమంగా కుక్కమాంసం తినడం మానేస్తున్నారు.