మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయ తెరపైకి వచ్చారు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన కీలక బాధ్యతలను అప్పగిస్తు ఒక ప్రకటన విడుదల చేసింది… కిరణ్ కుమార్ రెడ్డి ఎపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడుగా అలాగే రాజకీయ వ్యవహారల సభ్యుడుగా అవకాశం కల్పించింది….
11 మంది ఉపాధ్యక్షులు 18 మంది ప్రధాన కార్యదర్శును ఖరారు చేసింది… 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ 12 మందితో రాజకీయ వ్యవహారాలకమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది…
కాగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగురాష్ట్రాలు విడిపోక ముందు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నారు… విడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు… తాజాగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించడంతో వార్తల్లో నిలిచారు… …