కొద్దికాలంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు బోడె ప్రసాద్, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే… అయితే దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు….
- Advertisement -
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తమనేతపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే ఉరుకోబోమని నాని హెచ్చరించారు… టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లవభనేని వంశీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలో చేరుతారని అన్నారు…
ఇంకా ఆయనకు జగన్ వైసీపీ కండువా కప్పలేదని నాని గుర్తు చేశారు… వంశీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకిస్తూ జగన్ విధానాలకు మద్దతు పలికారని నాని అన్నారు…