లోకేష్ కి రాజకీయ బిక్ష పెట్టింది వైయస్సార్ అసలు నిజం చెప్పిన కొడాలి నాని

లోకేష్ కి రాజకీయ బిక్ష పెట్టింది వైయస్సార్ అసలు నిజం చెప్పిన కొడాలి నాని

0
102

రాజకీయంగా ఈ రాజధాని అంశం పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, అయితే మండలిలో తాము నెగ్గాము అని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు, అసలు మండలి రద్దు దిశగా ఆలోచనలు చేస్తున్నారు, తాజాగా నేడు అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నూట యాభై కిలోల బరువు ఉంటే ఆయన పెద్దాయన అని, అది పెద్దల సభ అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు విసిరారు. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే ఒకరకంగా నారా లోకేశ్ కు రాజకీయ బిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని చమత్కరించారు.

ఇంతకీ ఆయన ఆ మాట ఎందుకు అన్నారు అంటే, అసలు లోకేష్ ఎమ్మెల్యే అవ్వాలి మంత్రి అవ్వాలి అంటే చాలా కష్టం.. శాసనమండలి ఉంది కాబట్టే ఇలా ఈజీగా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యాడు అని సటైర్ వేశారు.. నాడు ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేశారని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిల్ ను మళ్లీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలా చేయకపోతే లోకేష్ రాజకీయంగా ఎక్కడ ఉండేవారు అనే విధంగా విమర్శలు చేశారు.