టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన గుడివాడలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన పై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నేడు గుడివాడకు వచ్చి కొత్తగా ఏం చెబుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా.. బెజవాడ వచ్చినా.. రాష్ట్రమంతా తిరిగినా.. శ్రమ, ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు(Chandrababu) శనిగ్రహం లాంటివాడని, ఆయన ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ శని తాండవిస్తుందని, చంద్రబాబు ప్రచారం చేసిన చోట టీడీపీ అభ్యర్థి గెలవడని ఘాటు విమర్శలు చేశారు. నాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. తన కోటరీ ఆస్తుల పెంపకానికే పాటుపడ్డాడని, చంద్రబాబు నైజమేంటో ప్రజలందరికీ తెలుసని కొడాలి నాని(Kodali Nani) అన్నారు.
Read Also: తాత అయిన రేవంత్ రెడ్డి.. మనవడి ఫోటో షేర్ చేస్తూ…
Follow us on: Google News, Koo, Twitter