పల్నాటి పులి ఆత్మహత్యకు దారి తీసిన మెయిన్ కారణాలు ఇవే

పల్నాటి పులి ఆత్మహత్యకు దారి తీసిన మెయిన్ కారణాలు ఇవే

0
45

ఏపీ రాజకీయాల్లో, పల్నాడు ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు మాజీ టీడీపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు. సంవత్సరానిక ఒక పార్టీ మరుతున్న రాజకీయ నాయకులకు కోడెల ఒక మెయిన్ ఉదాహరణ… ఎన్టీఆర్ నాటినుంచి చంద్రబాబు నాయుడు వరకు టీడీపీలో కొనసాగారు…

అంతలా పార్టీని నమ్ముకున్నటు వంటి వ్యక్తికి ప్రతిపక్షంలో చేరిన తర్వాత ఏమేరకు తమ్ముళ్లు అండగా నిలిచారో ఆయన ఆత్మహత్యే ప్రత్యక్ష సాక్షం… కోడెలపై కేసులు ఒక వైపు, ప్రభుత్వ కేసులు ఒకవైపు, కోడెలపై వైసీపీ ప్రభుత్వంలో నమోదు అయింది ఒక కేసు మాత్రమే.

అధికూడా తాను చట్టపరంగా ఎదుర్కుంటానని అందుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు కోడెల. ఇక ఆయన కూతురు, కుమారుడుపై కూడా కేసులు నమోదు అయ్యాయి, సత్తెన పల్లి జనాన్ని వెదించడం, వసూళ్లు చేయడం వంటి కేసులు నమోదు అయ్యాయి…

ఇలాంటి క్లిష్టమైన సమయంలో పార్టీ అధిష్టానం కోడెలకు సరైన సహకారం అందకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు, అధికార వైసీపీ నాయకులు అంటున్నారు. పదిరోజులుగా హైదరాబాద్ లో ఉంటూనే అధినేత చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ఆయన ఎదురుచూసినట్లు మంత్రి కొడాలి నాని కూడా ఇవాళ వెల్లడించారు.