కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు..

కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు..

0
107

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ… తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన క్రమశిక్షణా కమిటీ… రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీని పొగడటం అంటే… కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అవమానించటమే అనే అభిప్రాయానికి వచ్చింది క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.