కాంగ్రెస్‌ లో చేరిన కొండా దంపతులు

కాంగ్రెస్‌ లో చేరిన కొండా దంపతులు

0
165

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులు బలమైన నాయకులు కావడంతో వీరి చేరికతో వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని నమ్మకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు . కొండా దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు. వరంగల్ ఈస్ట్ ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖకు టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కేసీఆర్ , కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేసారు కొండా దంపతులు.

కొండా దంపతుల ప్రభావం వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. వరంగల్ ఈస్ట్ తో పాటుగా భూపాలపల్లి , పరకాల , వర్ధన్నపేట , పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో కొండా దంపతుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దాంతో మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొండా సురేఖ తెలంగాణ మొత్తం తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానని ప్రతిన బూనింది. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉండూ అంటూ కేటీఆర్ ని హెచ్చరించింది కొండా సురేఖ.