అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజే

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజే

0
56

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావూ రమేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ‘పారిస్’ లో వుంది. కొన్ని రోజులుగా అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు చిత్రయూనిట్‌.

దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. వచ్చేనెల 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తాజా సమాచారం. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలతో పాటు హీరో జాతకాన్ని కూడా పరిశీలించిన పండితులే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో, ఇటీవల ఆ పాట చిత్రీకరణను కూడా పూర్తి చేశారు. ఈ పాటకి జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ వుందట. దాంట్లో ఎన్టీఆర్ ను ఎన్నికల బరిలో నిలుపుతారని, అది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.