ఎన్టీఆర్ కోసం ఒకడి చేయి విర‌గ్గొట్టా…

ఎన్టీఆర్ కోసం ఒకడి చేయి విర‌గ్గొట్టా...

0
115

మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు . అభిమానులు అడిగిన ప్రశ్నలకు స‌మాధానం ఇస్తూ ఆక‌ట్టుకుంటుంటాడు. అంతేకాకుండా, స్నేహం కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌డ‌ని ఇటీవ‌ల హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలో చూశాం.జూ.ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌ల కోసం బౌన్స‌ర్‌లా మారి.. ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నాడు.అయితే, తార‌క్ కోసం మంచు మ‌నోజ్ త‌న చిన్న‌ప్పుడు ఓ సాహ‌సం చేశాడ‌ట‌. యంగ్ టైగ‌ర్‌ను చిన్న‌ప్పుడు ఎవ‌రో కొడితే మ‌నోజ్ వెళ్లి వాడి చేయి విర‌గ్గొట్టాడ‌ట‌.

అయితే, ఈ స్టోరీ ఏమిటో చెప్ప‌మంటూ ఓ అభిమాను మంచు మ‌నోజ్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరాడు. దీనికి మ‌నోజ్ న‌వ్వి.. తార‌క్‌నే అడుగు, ఈ విష‌యం గురించి నాకంటే.. బాగా చెబుతాడు అంటూ తెలిపాడు.దీంతో ఈ విష‌యం గురించి క్లుప్తంగా చెప్పాలంటూ అభిమానులంతా ట్విట్ట‌ర్ ద్వారా కోరారు. మ‌నోజ్ ఓ ర‌కంగా తార‌క్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. అందుకే, ఆయ‌న‌కు ఏమైనా జ‌రిగినా.. అత‌న్ని ఎవ‌రైనా.. ఏమైనా అన్నా భ‌రించ‌లేను. అయితే, మ‌నోజ్ చిన్న త‌నంలో ఏం జ‌రిగిందో అన్న‌ది తార‌క్ వివ‌రించే దాక ఈ స‌స్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.