కొత్త ట్రాఫిక్ రూల్ రెడ్ సిగ్నల్ పడితే హరన్ కొట్టకండి

కొత్త ట్రాఫిక్ రూల్ రెడ్ సిగ్నల్ పడితే హరన్ కొట్టకండి

0
116

మనం చాలా సార్లు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినా సరే హరన్ కొట్టేవారిని చూస్తూ ఉంటాం.. దీని వల్ల సౌండ్ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.. ఇలా ట్రాఫిక్ లో ఇష్టారీతిన హారన్ కొట్టేవారిని కట్టడి చేసేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు.

ఇది యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది.. ముంబైలో సిగ్నల్స్ దగ్గర ఇలా హరన్ కొట్టి ధ్వని కాలుష్యం పెంచుకున్నారు, దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడినా కొందరు హారన్స్ తో అందరినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుగకు ది పనిషింగ్ సిగ్నల్ ను తీసుకు వచ్చారు అక్కడ పోలీసులు.

ఈ విధానం ఏమిటి అంటే భారీ కూడళ్ల దగ్గర డెసిబుల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. ఈ సమయంలో రెడ్ సిగ్నల్ పడిన సమయంలో హరన్స్ కొడితే వారికి చూపించాల్సిన గ్రీన్ సిగ్నల్ మరింత ఆలస్యం అవుతుంది దీని వల్ల వారు మరింత సేపు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది.హారన్ శబ్దాలు డెసిబుల్స్ మీటర్లో 85 కంటే ఎక్కువ నమోదయితే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. ఇలా లింక్ చేశారు అక్కడ ట్రాఫిక్ పోలీసులు.

చత్రపతి శివాజీ మహారాజా టెర్నినస్ – మెరైన్ డ్రైవ్ – పెద్దార్ రోడ్ – హింద్మాతా సినిమా దబార్ – బాంద్రా ఇవి ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్రాంతాలు ఇక్కడ వీటిని ఏర్పాటు చేశారు, దీంతో చాలా మంది హరన్ దగ్గర చేయి వేయకుండా వెయిట్ చేసి గ్రీన్ సిగ్నల్ పడ్డాక ముందుకు వెళుతున్నారు. దీనిని తెలంగాణ మంత్రి కేటీఆర్ చూసి ఇది తెలంగాణలో అమలు చేస్తే బాగుంటుంది అని తెలియచేశారు డీజీపీకి హైదరాబాద్ సీపీకి.