కేటీఆర్ బర్త్ డే స్పేషల్ స్టోరీ….

కేటీఆర్ బర్త్ డే స్పేషల్ స్టోరీ....

0
155

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. కేసీఆర్ వారసత్వాన్ని పుచ్చుకుని 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు…. ఆతర్వాత పుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు… తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు కేటీఆర్… ఇక తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరుగగా మరోసారి అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు… తన తండ్రి కేబినెట్ లో సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా విధులు నిర్వహించారు…

ఇప్పుడు కేటీఆర్… జననం – విద్యాభ్యాసం గురించి తెలుసుకుందా..

తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు.1990-91 ఎస్‌ఎస్‌సీ, జీజీ స్కూల్‌ లో పూర్తి చేశారు… 1991-93 ఇంటర్‌, విజ్ఞాన్‌ కాలేజీ గుంటూరులో పూర్తి చేశారు… గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.

ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందా…

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఆ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించారు…

2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు… 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఐటీ మున్సిపల్‌, పరిశ్రమల శాఖలను కేటాయించారు

కేటీఆర్ వ్యక్తిత్వం…

కేటీఆర్ వ్యక్తిత్వం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా సామాన్యుడిగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా పరిస్కరిస్తుంటారు.. తనకు సమస్య వస్తే ఆలోచిస్తారేమో కానీ ప్రజలకు సమస్య వస్తే క్షణం కూడా ఉండరని ఆయన్ను దగ్గరగా చూసిన వ్యక్తులు అంటుంటారు.. తండ్రిలాగే ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఆయనది… పార్టీలో ఉన్నఅందరి నేతలతో కలిసి మెలిసి ఉంటారు…

పార్టీ నేతలకు ఏలాంటి లోటు లేకుండా చూస్తారు… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ నెటిజన్స్ ఆయన దృష్టికి తీసుకువచ్చిన ప్రతీ సమస్యను తీర్చుతారు… విదేశాల్లో పని చేస్తూ అష్ట కష్టాలు పడుతున్న తెలంగాణవాసులను రాష్ట్రానికి తీసుకుంచ్చే విషయంలో కీలకంగా వ్యవహరిస్తారు…. అందుకే ఇటీవలే జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజలు… మునుముందు కూడా ఇలాగే ప్రజా సేవ చేస్తూ ప్రజా నాయకుడుగా…. తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…