కేటీఆర్ లేదా కేసీఆర్ రావాల్సిందే..? బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్

0
104

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు వానను సైతం లెక్క చేయకుండా వరుసగా రెండోరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు నిలవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

విద్యార్థులు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ఓ విద్యార్థి బాసర సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకురాగా.. ఆయన వెంటనే స్పందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారని రీ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.

సమస్య ఏంటంటే:

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వత వీసీ నియామకం జరగలేదు. దీనికి తోడు మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, యూనిఫాం డ్రెస్సుల పంపిణీ చేయడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని.. విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.