చైనాకి కుబేరులు సాయం నిజంగా గ్రేట్ అనాల్సిందే

చైనాకి కుబేరులు సాయం నిజంగా గ్రేట్ అనాల్సిందే

0
87
People walking on Wangfujing Street in Beijing,Chaina

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ తో చైనా విల‌విల‌లాడుతోంది, ఇప్ప‌టికే రెండువేల మందికి పైగా జ‌నాలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. మ‌రో వైపు చైనా ఆర్ధిక ప‌రిస్దితి కూడా బాగా మంద‌గించింది…ఈ స‌మ‌యంలో చైనాని ఆదుకునేందుకు ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, జాక్ మా చైనాకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చారు.

జాక్ మా మొత్తం రూ.14.5 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు.జ‌న‌వ‌రిలో ఆయ‌న 10 మిలియ‌న్ డాల‌ర్లు ప్ర‌క‌టించారు…జాక్ మాకు చెందిన ఆలీబాబా గ్రూప్ కరోనాపై పోరాటానికి 145 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 100 మిలియన్ డాలర్ సాయం ప్రకటించారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఈ సాయం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక దీనికోసం వ్యాక్సిస్ త‌యారు చేయాల‌ని చైనా ప్ర‌య‌త్నాలు చేస్తోంది, అయితే ప‌రిశోధ‌న‌లో ఉన్నారు వైద్యులు.. మ‌రో ఏడాది ప‌ట్టే అవ‌కాశం ఉంది అంటున్నారు.