చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్…

చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్...

0
79

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకురాలు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేశారు… ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో అర్ధం కావడంలేని ఆరోపించారు….

తాజాగా ఆమె పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో కరువు తీరి రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ద్వేషంతో 320 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అపద్దపు ప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు….

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న పథకాలను యావత్ దేశమంతా మెచ్చుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు… అపద్దాలు చెబుతూ ఛీ ఛా అనిపించుకుంటూ బ్రతకడంలో గొప్పదనం ఉందా అని ప్రశ్నించారు…