Jr.NTR పై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్..రాజకీయంగా పనికి రాడంటూ..

0
130

జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి సంచలన కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సముచితమే అని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం గర్వకారణం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు చురకలంటించారు. బాబు తన స్వార్ధం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని, టీడీపీ పగ్గాలు లోకేష్ కు ఇవ్వడమే ప్రధాన ద్యేయమని ఆమె మండిపడ్డారు. రాజకీయంగా ఎన్టీఆర్ పనికిరాడని బాబు కుట్రపూరిత బుద్ది చూపుతున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గ్రహించాలని తాను ఎప్పటి నుండో కోరుతున్నానని లక్ష్మీపార్వతి అన్నారు.