HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు..కారణం ఇదే

0
109

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. టికెట్ల విక్రయం దగ్గరి నుండి మొదలుపెడితే మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయం సరిగా లేకపోవడంతో HCAపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ టికెట్ల విక్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై 3 కేసులు నమోదు అయ్యాయి.

ఇక తాజాగా టికెట్ పై మ్యాచ్ సమయం తప్పుగా ఇచ్చిందని HCAపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టికెట్ పై మ్యాచ్ సమయం రాత్రి 7.30 గంటలకు అని ఉండగా మ్యాచ్ 7 గంటలకే ప్రారంభించారని ఫిర్యాదుతో బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

కాగా HCAపై ఇప్పటివరకు 4 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. చాలా కాలం తరువాత హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం వచ్చినా HCA విఫలమై అబాసు పాలైంది.