‘చంద్రబాబుకు 74మందిని భద్రతగా ఇచ్చాం’

'చంద్రబాబుకు 74మందిని భద్రతగా ఇచ్చాం'

0
103

తనకు భద్రత కుదింపుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, కావాలనే రాజకీయ కారణాలతో ఆయనకు భద్రతని తగ్గించారని చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు. గతంలో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెదేపా అధినేతతో పాటు ఆయన కుటుంబానికీ భద్రత తగ్గించారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎర్ర చందనం స్మగ్లర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న చర్యల వల్ల వారి నుంచీ ఆయనకు ముప్పు ఉందని తెలిపారు.